సనాతన ధర్మము మహర్షుల విజ్ఞానము కణాధుని కణసిద్ధాంతము 
ముందు మాట
                 మన సనాతన  ధర్మంలో ఎందరో మహర్షులు వివిధ రంగాలలో విశేషమైన    కృషి చేసారు, అనేక వేల దివ్య సంవత్సరాలు వారు సమాధిలో ఉండి, అనేకమైన అధ్బుత విషయాలు తమ మనో నేత్రంతో ప్రత్యక్షముగా అనుభవంలోనికి తెచ్చుకొని   కొన్ని వందల ప్రయోగాలు చేసిన తర్వాత వారు తమ విజ్ఞాన సర్వస్వాన్ని మన సనాతన భారత దేశంలో సమాజానికి అన్ని వర్గాల వారికి   పనికి వచ్చే విధంగా  ఎన్నో సూత్రాలని వారు రచించారు. ఖగోళశాస్త్రము, భూగోళశాస్త్రము,  మంత్రం శాస్త్రము, జోతిష్యశాస్త్రము, జన్యుశాస్త్రము,వాస్తుశాస్త్రము అనేక విధమైనటువంటి అధ్బుతమైనటువంటి  ఉపవేదమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం, అధర్వణ  వేదాన్ని అనుసరించి మహర్షి       భరద్వాజుడు  అనేక వేల విమానాల్ని ఆరోజుల్లోనే కనుగొనడం  జరిగింది. 
అదేవిధంగా విశ్వామిత్రుడు, జమదగ్ని, అజ్ఞవల్కుడు,  పరశురాముడు, పిఫలాదుడు, జవనుడు, ధన్వంతరి, చరకుడు, వాక్ భట్టాచార్యుడు, విశ్వామిత్రుడు, మైత్రేయి, గరిని  ఇంకా అసంఖ్యాకమైన మహర్షులు అందరూ కూడా మొత్తం  ప్రపంచమంతా శాంతివంతంగా జీవించాలంటే వారు నిత్యజీవితంలో చేయవలసినటువంటి దినచర్యలు, ఋతుచర్యలు,  ఆహారపదార్ధముల యొక్క విజ్ఞాన సర్వస్వమంతా కూడా  చాలా చక్కగా మన భారత దేశానికీ ముఖ్యంగా,  తరువాత  అన్ని దేశాలవారికి భారత దేశం ఒక మార్గ దర్శకత్వం   వహించి అన్ని దేశాలకు వ్యాపింప చేసారు.
                       నేను వృత్తిరీత్యా   మందులు తయారు చేసే  పరిశ్రమలో పని చేయడం జరిగింది. ఆంగ్లేయ వైద్యవిధానం దాదాపు ౩౩ సంవత్సరాలు చేశాను. అందులో మూడు సంవత్సరాలు  ఆయుర్వేదం తయారు చేసే సంస్థలో పనిచేయటం . అన్ని
విభాగాలలో పని చేయడం జరిగింది అంటే బాటిల్ వాషింగ్,బాటిల్ సీలింగ్, పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ,ప్రొడక్షన్, ట్రైనింగ్, లాంచింగ్  ఇలా  అన్ని   శాఖలో  కూడా  పని చేశాను. దాదాపు పదహారున్నర సంవత్సరాలు నేను ఈస్ట్ ఆఫ్రికా వెళ్ళటంతో ,  అక్కడ కూడా అనేకమంది మూలికావైద్య విధానమా చేసే వాళ్ళతో పరిచయం అయింది. నేను స్వయంగా  40 రకాల వనమూలికల   ఎక్స్ట్రాక్ట్ స్ని      తయారు చేసి పెట్టుకోవటం, ఎంతోమందికి ఆయుర్వేద  వైద్య విధానం ప్రకారం గా  నాకు తెలిసిన మిడిమిడి  జ్ఞానం తోటి  చికిత్సలు  చేయడం   సంభవించింది. సహజంగా వృత్తి రీత్యా నేను అనేక బహుళజాతి విదేశీ కంపెనీలో పని చేయటం వారి ఉత్పాదనలని  చాలా గ్రామాలలో పట్టణాలలో స్లయిడ్ ప్రెసెంటేషన్ ద్వార ప్రచారం చేయటం.  అనేక మందుల యొక్క పని చేసే విధానాలు దానికి సంబంధించిన ఫార్మకాలజీ , ఫార్మకో కైనటిక్స్, అనాటమీ, ఫిజియోలజీ  ఈ  మానవ శరీరానికి సంబంధించిన  అన్ని  స్వయంగా చదివి అర్థం చేసుకుని వివిధ వైద్య విధానం లో ఉన్న వారికి  అంటే జనరల్ మెడిసిన్ , జనరల్ ఫిజీషియన్స్,సర్జన్స్, కార్డియాయోలజిస్ట్స్ , గైనకాలోజిస్ట్స్ ఇలా  ఎంతోమంది విదేశీ వైద్యుల తోటి ప్రొఫెసర్ తోటి కలిసి పనిచేయటం  అంతేకాకుండా అనేక శిక్షణ  తరగతులకు వెళ్ళటం.  ఇతర దేశాల వారితో కూడా వారితో కూడా  సన్నిహితంగా భావాలను జ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది.  ఇదే నా అదృష్టంగా భావిస్తూ ఉండేవాడిని.

                           ఈ క్రమంలోనే  బయో ఎనర్జీ మీద  కూడా  నేను కొన్ని ప్రయోగాలు చేయడం  నా దగ్గరకు వచ్చి న వారికి ప్రాణశక్తి ఉపయోగించి  చికిత్సా విధానాల  ద్వారా వారి జబ్బులను నయం చేయటం ,కేవలం భగవంతుని అనుగ్రహం గా నేను భావిస్తాను.

                           భారతదేశానికి వచ్చిన తర్వాత మల్లాది గోవింద దీక్షితులు గారిని కలవడం   నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం గా  భావిస్తుంటాను. ఆయనను పిఠాపురంలో కలిసి  వారం రోజులు  ఆయనతో పాటు  గంటలు గంటలు కూర్చుని    అనేక విజ్ఞానపరమైన    ఆధ్యాత్మిక పరమైనటువంటి  సంభాషణలు  చేస్తూ ఉండే వాడిని. ఒకసారి ఆయన భాగ్యనగరానికి వచ్చినప్పుడు దాదాపు 40 రోజులు  , అయన తో ఉండి ఎన్నో విజ్ఞాన పరమైన విషయాలను చర్చిస్తుండగా ఆ  సందర్భంలో నేను ప్రత్యేకంగా    జన్యు కణాలకు    గ్రహాలకు  మరియు సంఖ్యా శాస్త్రముకు  ఉన్న సంబంధాన్ని  వివరించినప్పుడు ఆయన చాలా  సంతోషించారు .

 శ్రీపాద శ్రీవల్లభ చరితార్థం లో రెండో భాగంలో జన్యు  శాస్త్రం గురించి  అధికంగా చర్చించినట్లు ఆయన ఒక సందర్భంలో చెప్పారు.  నాకు  ఈ వైద్య రంగంతో   మరియు మందుల తయారీ కంపెనీ వాళ్లతో  ఉన్న సంబంధం మూలంగా   ఎన్నో  వైద్య విధానానికి సంబంధించిన   ప్రత్యేకమైన  శిక్షణకు సంబంధించిన పుస్తకాలు ఆయా కంపెనీ లు ఉండే  క్వార్టర్స్ నుంచి రావడం       ముఖ్యంగా జర్మనీ నుంచి   రావటం వాటిని నేను  అధ్యయనం చేసి  అంతేకాకుండా నేను ఎన్నో ప్రాజెక్టులను లాంచ్  చేసిన కారణంగా  అందులో ఉన్నటువంటి   విజ్ఞానాన్ని  ముక్కలు ముక్కలుగా ఉన్న  వాటిని నేను చేర్చి  తార్కికంగా   మరి జాన స్థితిలో వెళ్ళినప్పుడు  నాకు తోచిన వన్ని నోట్స్ రాసుకోవడం  అవన్నీ మల్లాది గోవింద దీక్షితులు వారి దగ్గర ముఖ్యంగా   జన్యు కణాలను గురించి ప్రస్తావించినప్పుడు ఆయన నన్ను అలా ఉత్సాహపరచడం, ప్రతిరోజు పిఠాపురం వెళ్లిన తర్వాత కూడా దాదాపు  మేమిద్దరం ఒక గంట సేపు అనేక విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది ఒక్క  భగవంతుని అనుగ్రహం మూలంగానే  శ్రీపాద శ్రీ వల్లభుని అనుగ్రహం మూలంగానే ఎంతో కష్టమైనటువంటి ,ఈ జన్యుకణాల మీద నేను ఒక పుస్తకాన్ని రాయడం, అనేది నిజంగా  చాలా సాహసోపేతమైనది ముఖ్యంగా విజ్ఞానపరమైన   ఇటువంటి శాస్త్రాన్ని  పెద్దభూమిక లో ఉన్నటువంటి అనేకమైన  విజ్ఞానపరమైన, అనునాతనమైనటువంటి   ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని మన సనాతన ధర్మంలో  అనేకమంది మహర్షులు ప్రయోగాలు చేసి అనేక వేల సంవత్సరాలు సమాధి స్థితిలో  జ్ఞాన స్థితిలో ఉండి వాటిని ప్రత్యక్షంగా దర్శించి  అనుభవించినవి ఈ రెండిటిని మేళవించి సామాన్య మానవులకు కూడా అర్థం అయ్యేటట్లు చప్పడం  అనేది ఒక    పెద్ద తపస్సు వల్లనే  అని         భావించవలసి ఉంటుంది. ముందుగా తెలుగులో  మొదలుపెట్టిన ఆ తర్వాత   ఆంగ్లంలో దాదాపు ఒక ఇరవై ఐదు అధ్యాయాలు రాయటం జరిగింది దానికి మా శ్రీమతిగారు చాలా సహాయం చేశారు నాకు  కంటిలో సమస్య   ఉన్నది, దాని కారణంగా  నేను చదవలేదు, అందుకు నేను చెప్తున్నప్పుడు  ఆవిడ రాస్తుండడం, మళ్ళీ చదివి దాంట్లో కొన్ని భాగాలు తీసివేయడం,  కొత్త భాగాలు రాయడం, కొద్దిగా భాష మార్చు కోవడం ,  ఈ విధంగా దాదాపు ఒక ఏడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడిన తర్వాత, ఇటువంటి పుస్తకం బయటికి రావడం జరిగింది.

                     స్వతహాగా నేను శిక్షణ తరగతులను  అంటే ట్రైనింగ్ మేనేజర్ గా పని చేస్తూ ఉన్నాను కాబట్టి మా వృత్తిలో ముఖ్యంగా ఒకటే విషయాన్ని అనేక కోణాలలో చెప్పవలసి వస్తూ ఉంటుంది.   ఎందుకంటే తరగతిలో ఉన్న విద్యార్థుల యొక్క బుద్ధి కుశలత ఒకటే మాదిరిగా ఉండదు ,కొంతమంది కింద స్థాయిలో ఉంటారు ,కొంతమంది మధ్య స్థాయిలో ఉంటారు కొందరు చెప్పగానే  గ్రహిస్తారు  కానీ మా దృష్టి అంతా ఈ  కింది  స్థాయి వాళ్ల మీద  కేంద్రీకరింప  బడి ఉంటుంది కాబట్టి,  ఒకటే విషయాన్ని నాలుగైదు రకాలుగా చెప్పడం మాకు అలవాటు.   అదే విధంగా ఈ రచనలు ఎటువంటి ప్రత్యేకమైన సిలబస్ లేకుండా  మనసులో కలిగిన ఒక ప్రేరణ మూలంగా అవి చెప్పటం జరిగింది.
                                            మొట్టమొదటిసారిగా  ప్రయత్నించినప్పుడు ఇంగ్లీషులో టైప్ చేసిన వాళ్ళు అనేక టైపింగ్ మిస్టేక్స్ చేయడం వలన  సంవత్సరం దాకా రచించిన రచనలు దాదాపు 11 అధ్యాయాలలో  వచ్చినవి  కూడా కొంత  నిరాశతో  అవి మానేయడం జరిగింది  అటువంటి సమయంలో ఒక పాఠకుడు ఒక మిత్రుడు "కెంటకి" నుంచి నాకు మెయిల్ ద్వారా   మీరు రాసిన విషయాలు  చాలా బాగున్నాయి మరి ఎందుకు ఆపేశారు మళ్ళా మొదలు పెట్టండి అని చెప్పటం, తను తప్పకుండా సహాయం చేస్తానని ముందుకు  రావడం వల్ల చిరంజీవి  ప్రవీణ్ గారు ఆయన కెంటకీ , యూఎస్ లో ఉంటారు ఆయన యొక్క ప్రోద్బలంతో మళ్ళా మొదటి అధ్యాయం నుంచి 25 వ అధ్యాయం వరకు , ఏడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి రాయడం జరిగింది . జ్ఞాపకశక్తి లో ఉన్న ఎప్పుడో చదివిన విషయాలను క్రోడీకరించి అది నోటి మాటగా చెప్పడం రికార్డ్ చేయడం అది చాలా  కష్టమైన ప్రక్రియ. 
 రాసేటప్పుడు కొన్ని విషయాలు మనం మార్చుకోవాలంటే అవి కొట్టి వేయటం జరుగుతుంది కానీ చెప్పేటప్పుడు మాత్రం అక్కడ ఒక వాక్యం నిర్మాణం సరిగ్గా లేకపోతే మళ్లీ వెనక్కు వచ్చి చెప్పి సరిదిద్దుకునే అవకాశం ఉండదు కనుక అటువంటి పొరపాటు జరిగి ఉంటే, పాఠకులందరూ నాకున్న ఈ అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన్నింతురు గాక.

                                 ఇటువంటి విజ్ఞానపరమైన విషయాలన్నీ రాయటానికి  బాల్యంలో మొట్టమొదటిగా  నాకు మా మాతృమూర్తి గురువు రూపంలో ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక  పరంగా, శాస్త్రీయ పరంగా ఎంతో ఓపిగ్గా చెప్తూ ఉండేవారు.  అలాగే మా నాన్నగారు కూడా ఎన్నో   గ్రంధాలను తెప్పించి ఆయన చదువుతూ నాకు కూడా చెప్తూ ఉండేవారు. తల్లితండ్రులు ఇద్దరూ కూడా ఎన్నో గ్రంధాలను  చదవటం అలవాటు ఉన్నవారు,  కాబట్టి  సహజంగా నాకు కూడా ఈ లక్షణం అలవాటు పడింది. అందులోనూ  నేను  పల్లెటూర్లో పెరిగాను కాబట్టి నాకు ఆధ్యాత్మిక ప్రయాణంలో మా తల్లి గారు , మా తండ్రిగారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు .
ఆధ్యాత్మిక బీజాలను వారు మాకు మా మనసు  అనే క్షేత్రంలో దృఢంగా నాటారు కాబట్టి ఇటువంటి గ్రంధాన్ని రాయటం సంభవించింది కాబట్టి ఈ గ్రంధాన్ని ఎంతో వినయ భావంతో గౌరవభావంతో ప్రేమతో నా తల్లిదండ్రులైన  స్వర్గీయ  నండూరి శ్రీ రామారావు గారు మరియు అమ్మగారు   శ్రీమతి  రాజరాజేశ్వరి గారికి, నేను   మనవపూర్వకంగా అంకితం చేస్తున్నాను.

                         అదే విధంగా ఈ రచనకు మళ్లీ  ప్రేరణ ఇచ్చినటువంటి  చిరంజీవి ప్రవీణ్ గారికి,  మా సోదరి, మా శ్రీమతి ఇంకా అనేక మంది నన్ను ప్రోత్సహించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. అయితే చాలామంది మాకు ఇది తెలుగులో కూడా కావాలని  రెండేళ్ల క్రితం నుంచి అడిగినప్పుడు  నాకు కుదరలేదు   చివరిగా ఇప్పుడు తెలుగులో దాన్ని అనువాదం చేసి పాఠకులందరికీ   అందించాలని ఒక  సత్సంకల్పంతో మీ అందరికీ కూడ ఈ అద్భుతమైన  కణాధకణసిద్ధాంతాన్ని  మీ ముందు ఉంచబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది పాఠకులందరూ చదివి,   వారి అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియ చేయాలని  చెప్పుకుంటున్నాను , ధన్యవాదాలు.